ఈ పండ్లను తీసుకోండి.. జుట్టు సమస్యలకి చెక్ పెట్టండి

దానిమ్మ రసం తాగితే.. జుట్టు బలోపేతం అవుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దానిమ్మ గింజల నూనెను జుట్టుకు మసాజ్ చేస్తే.. చుండ్రు, దురదచ జుట్టు రాలడం వంటి సమస్యలను దూరమవుతాయి

అరటి పండు జుట్టు రాలడాన్ని, జుట్టు పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పండులో పొటాషియం ఉంటుంది కాబట్టి దీనిని తలకు అప్లై చేస్తే.. జుట్టు మృదువుగా మారుతుంది

స్ట్రాబెర్రీలో రాగీ, మాంగనీస్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలున్నాయి. ఇవి తలలో ఫంగస్ పెరుగుదలను నిరోధించి, జుట్టు సమస్యల నుండి తలను కాపాడుతుంది

ఆపిల్ ఆరోగ్యకరమైన జుట్టును అందించడంలో సహాయపడుతుంది. చుండ్రు నివారణకు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఆపిల్ ఆకులు, ఆకుపచ్చ ఆపిల్ తొక్క పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది

అవోకాడోలో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కె, ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం ఫాస్పరస్ వంటి విటమిన్లు & ఖనిజాలు ఉన్నాయి. ఇవి జుట్టును హైడ్రేట్‌గా ఉంచడానికి ఉపయోగపడతాయి

బొప్పాయిలో బోలెడన్ని పోషకాలున్నాయి. ఇవి బట్టతల నివారించడానికి, జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి సహాయపడతాయి. బొప్పాయి ఆకుల్ని జుట్టు మీద కండీషనర్‌గా ఉపయోగించుకోవచ్చు