Site icon NTV Telugu

IPL 2023 : 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ ఎంతంటే..?

Pbks

Pbks

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు చెరో 10 మ్యాచ్ లు ఆడగా.. ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.

Also Read : Revanth Reddy : 5 అంశాలతో యూత్‌ డిక్లరేషన్.. వివరాలు వెల్లడించిన రేవంత్‌

ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కేకేఆర్ టీమ్ భావిస్తోంది. శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ లు ఓపెన‌ర్లుగా క్రీజులోకి వచ్చారు. అయితే తొలి ఓవర్ లోనే ప్రభు సిమ్రాన్ సింగ్ మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఇక రెండో ఓవ‌ర్‌ను హర్షిత్ రాణా వేయ‌గా 9 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి, మూడో బంతికి శిఖర్ ధావ‌న్ బౌండ‌రీలు కొట్టాడు. అయితే చివరి బంతికి రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవ‌డంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(12) ఔట్ అయ్యాడు. దీంతో 21 ప‌రుగులకే పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స( 0) డకౌట్ అయ్యాడు.

Also Read : Karnataka Polls: సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం.. ఈసీకి ఫిర్యాదు

హర్షిత్ రాణా బౌలింగ్ లోనే రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ పట్టుకోవడంతో భానుక రాజపక్స పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో 29 పరుగులకే పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన మంచి ఊపుమీద కనిపించాడు. పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్(15) వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 53 పరుగులకే పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ ను కోల్పోయింది.

Also Read : RK Roja: సెల్ఫీ డ్రామా.. వారికి సెల్ఫ్ గోల్..!

పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో కెప్టెన్ శిఖర్ ధావన్, జితేశ్ శర్మ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 10 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 83 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ ( 31 బంతుల్లో 7 ఫోర్లతో 33 పరుగులు ), జితేశ్ శర్మ ( 11 బంతుల్లో 15 పరుగులు ) అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.

Exit mobile version