భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్‌కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. టోక్యో ఒలింపిక్స్ శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకు డబ్ల్యూఎఫ్ ఈ చర్యలు తీసుకుంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆగస్టు 16 వరకు వినేశ్ ఫొగాట్‌కు గడువు ఇచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మరో యువ రెజ్లర్ సోనమ్‌కు కూడా డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది. టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కచ్చితంగా పతకం తీసుకొస్తుందని భావించినప్పటికి పేలవమైన ఆటతీరుతో వినేశ్ ఫొగాట్ నిరాశ పరిచింది. దీనికితోడు క్రీడా ప్రాంగణంలో ఆమె అనుచిత ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అథ్లెట్లకు కేటాయించిన గదుల దగ్గర తోటి రెజ్లర్లతో కలిసి ఉండటానికి నిరాకరించిందని, అలాగే వారితో ప్రాక్టీస్ చేయలేదని ఆమెపై అభియోగాలు ఉన్నాయి.
Read: ఆ నది ఒడ్డున వెండినాణేలు…ఎగబడిన జనం…
మరోవైపు ఒలింపిక్స్‌లోనూ భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్ కిట్‌ను ధరించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి తిరిగొచ్చిన వినేశ్‌కు WFI నోటీసులు జారీ చేసింది. టోక్యో ఒలింపిక్స్ ముందు వినేశ్ శిక్షణ కోసం హంగేరీ వెళ్లింది. అక్కడి నుంచి టోక్యోకు వచ్చింది. అప్పటికే ఆమెకు ఒలింపిక్స్ విలేజ్‌లో కేటాయించిన గదిలో తన తోటి రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్, సీమా బిస్లాతో కలిసి ఉండడానికి నిరాకరించింది. తాను హంగేరీ నుంచి వచ్చానని.. వారు నేరుగా భారత్ నుంచి వచ్చారని.. కరోనా సోకే అవకాశం ఉందని.. వారితో కలిసి ఉండలేనని ఆరోపించింది. వారితో కలిసి ప్రాక్టీస్ చేయలేదని.. అలాగే రెజ్లింగ్‌లో పాల్గొనేటప్పుడు స్పాన్సర్ కిట్లను కూడా ధరించలేదని అధికారులు వివరించారు. ఫొగాట్ పాల్గొన్న మ్యాచ్‌ల్లోనూ అధికారిక స్పాన్సర్ జెర్సీని కాకుండా వేరేది ధరించింది. చివరికి పేలవ ఆటతో సెమీస్‌లోనే నిష్క్రమించింది. వినేశ్ సమాధానం నమ్మశక్యంగా లేకపోతే WFI దీర్ఘకాలం నిషేధం విధించే అవకాశం ఉంది.