Site icon NTV Telugu

Kraigg Brathwaite: విండీస్ ప్లేయర్ వెరీ స్పెషల్.. ఒక్క టీ20 ఆడకుండానే వరల్డ్ రికార్డు

Kraiggbrathwaite

Kraiggbrathwaite

ప్రస్తుతం క్రికెట్లో టీ20ల హవా నడుస్తోంది. ప్రతి దేశం ఒక్కో లీగ్స్‌ నిర్వహిస్తున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 లీగ్స్ వున్నాయి. అయితే ఇప్పుడున్న క్రికెటర్లు కేవలం టీ20ల కోసం కూడా రిటైర్ అవుతున్నారు. కానీ ఒక ప్లేయర్ వీటన్నిటికీ భిన్నం. ఎందుకంటే ఇప్పటికి ఒక్క టీ20 మ్యాచ్ ఆడలేదు ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్ కానీ 100 టెస్టులు ఆడేశాడు.

ఇది కూడా చదవండి: US: పాలస్తీనా వధువుకు నరకం.. 140 రోజులు బంధించి ఏం చేశారంటే..!

అవును విండీస్ ప్లేయర్ క్రైగ్ బ్రాత్ వైట్ ఏకంగా 100 టెస్టు మ్యాచులు ఆడాడు. కానీ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఇప్పటికి ఆడలేదు. అంతే కాదు వన్డే మ్యాచ్‌లు కూడా కేవలం 10 మాత్రమే ఆడాడు. అది కూడా 8 ఏళ్ల క్రితం చివరి వన్డే ఆడాడు. ఇక టెస్టుల విషయానికి వస్తే.. 2011లో పాకిస్తాన్ మీద తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2వ టెస్టులో ఒక మైలురాయిని కూడా అందుకున్నాడు. అదే వెస్టిండీస్ తరుపున 100 టెస్టులు ఆడటం. ఇలా 14 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నా, వన్డే మరియు టీ20ల్లో కనిపించకపోవడం వింతగానే వుంది.

ఇది కూడా చదవండి: OSSS : మలయాళ హిట్ సినిమా తెలుగు రీమేక్ ‘ఓం శాంతి శాంతి శాంతిః

అసలే కరేబియన్ ప్లేయర్స్ అంటే టీ20లే గుర్తుకువస్తాయి. మరి అలాంటి టైంలో టెస్ట్ క్రికెట్ పై ఇంత మక్కువ ఉండటం నిజంగా గ్రేట్ అని ఒప్పుకోవాలి.ఇక క్రైగ్ బ్రాత్ వైట్ 100 టెస్టుల్లో 5943 పరుగులు చేసాడు. దీంట్లో 12 సెంచరీలు వున్నాయి

Exit mobile version