Site icon NTV Telugu

MS Dhoni: జార్ఖండ్‌ రోడ్లపై ఎంఎస్.ధోనీ బైక్ రైడింగ్.. వీడియో వైరల్

Msdhoni

Msdhoni

భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్ ఆటగాడు ఎంఎస్.ధోనీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి నడుపుతూ రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను చూసి ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ఇటీవలే ధోనీ తన స్నేహితులతో కలిసి యూఎస్ పర్యటనకు వెళ్లారు. టూర్ ముగించుకుని రాంచీ చేరుకున్నాక.. ప్రస్తుతం ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. బైక్ రైడింగ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Virat Kohli Fan: వీరాభిమాని.. కోహ్లీ కోసం ఓ బాలుడు ఏం చేశాడంటే..?

2024 ఐపీఎల్ క్రికెట్ ముగిశాక రాంచీలో ఇంటిలో ధోనీ విరామం తీసుకుంటున్నారు. కుటుంబంతో కలిసి గడుపుతున్నారు. ఇటీవల అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో సందడి చేశారు. ఇక ధోనీకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఎలాంటి ఆటలు లేవు. దీంతో ధోనీ ఇంటి సమీపంలో బైక్ రైడింగ్‌లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Devara: దేవర – తంగలాన్ సినిమాల మధ్య పోలిక .. ఏంటో తెలుసా?

Exit mobile version