Site icon NTV Telugu

Wasim Akram: ధోనీకి అతడే సరైన వారసుడు.. సీఎస్కే కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు

Wasim On Csk Captaincy

Wasim On Csk Captaincy

Wasim Akram Interesting Comments On CSK Captaincy: మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్ 2023 సీజన్ చివరిదన్న వార్తలు కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! ఆ వార్తలు నిజమేనన్నట్టుగా.. ధోనీ కూడా షాకింగ్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. ప్రతీ గ్రౌండ్‌లోనూ భారీ స్థాయిలో అభిమానులు తరలివస్తుండటంతో.. వాళ్లందరూ తనకు ఫేర్‌వేల్ ఇస్తున్నట్టుగా ఉందని ధోనీ ఓ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో చెప్పుకొచ్చాడు. ఇక అప్పటినుంచి ధోనీకి ఇదే ఫైనల్ సీజన్ అనే వాదనలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ధోనీ రిటైర్ అయ్యాక చెన్నైకి ముందుండి నడిపించే నాయకుడు ఎవరు? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. గత సీజన్‌లో ఆల్రెడీ ఈ విషయంపై ఓ ప్రయోగం చేశారు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్కే పగ్గాలు అప్పగించారు. అయితే.. అతడు కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలం అవ్వడంతో.. తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో.. మళ్లీ ధోనీ పగ్గాలు అందుకోవడం జరిగింది. దీంతో.. ధోనీ తప్పుకుంటే, అతని స్థానంలో ఎవరైతే కెప్టెన్‌గా వస్తే బాగుంటుందన్న టాక్ నడుస్తోంది.

Brij Bhushan Issue: బ్రిజ్‌భూషణ్ వివాదం.. సాక్షితో ఫోటో వైరల్.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్‌ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడున్న వాళ్లలో సీఎస్కే కెప్టెన్‌గా రహానే పర్ఫెక్ట్‌గా సరిపోతాడని అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ‘‘గత సీజన్‌లో సీఎస్‌కే రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చినప్పుడు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ జట్టుతో పాటు జడేజా ప్రదర్శనపై కూడా అది తీవ్ర ప్రభావం చూపింది. ఆ దెబ్బకు మధ్యలోనే కెప్టెన్‌ను మార్చాల్సి వచ్చింది. తిరిగి ధోనీనే పగ్గాలు పట్టాడు. ఇప్పుడు ధోనీ రిటైరైతే.. అతని స్థానంలో రహానేనే మెరుగైన ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. అతడు భారత ఆటగాడు కావడమే కాదు.. నిలకడైన ఆటతో దూసుకెళ్తున్నాడు. ఈ లీగ్‌లో విదేశీ ఆటగాళ్ల కంటే.. లోకల్ క్రికెటర్లే కెప్టెన్లుగా మెరుగ్గా రాణిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు కెప్టెన్‌గా ఉంటే.. తమ జట్టులో ఉన్న అందరి పేర్లను గుర్తు పెట్టుకోవడం వాళ్లకి కష్టం. కాబట్టి.. వాళ్లకు జట్టుని నడిపించడం కష్టతరం అవుతుంది. ధోని గనుక సీఎస్‌కే పగ్గాలు వదిలేస్తే.. అతని వారసుడిగా రహానే మాత్రమే సరైనోడు’’ అంటూ వసీం అక్రం చెప్పుకొచ్చాడు. అయితే.. రహానేపై ఫ్రాంఛైజీకి నమ్మకం ఉంటేనే, ఇలాంటి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

Asia Cup 2023: పాకిస్తాన్‌కి బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఆసియా కప్ రద్దు?

Exit mobile version