Site icon NTV Telugu

Virat Kohli Record: ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ.. మొదటి బ్యాటర్‌గా ‘కింగ్’ కోహ్లీ రేర్ రికార్డు!

Virat Kohli

Virat Kohli

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైయిపు మొదటి వన్డేలో ఓడిన న్యూజిలాండ్‌.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ రేర్ రికార్డు సాధించే అవకాశాలు ఉన్నాయి.

విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకు వరుసగా 5 వన్డేల్లో హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ శర్మ, అజింక్య రహానేతో సమానంగా విరాట్ నిలిచాడు. కింగ్ మరో హాఫ్‌ సెంచరీ చేస్తే.. వరుసగా 6 మ్యాచుల్లో హాఫ్‌ సెంచరీలు బాదిన మొదటి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. కింగ్ సూపర్‌ ఫామ్‌ చూస్తే.. ఈరోజు సాధించే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ తన చివరి 5 వన్డేల్లో 156.33 యావరేజ్‌తో 469 పరుగులు బాదాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచుల్లో 131, 77 పరుగులు చేశాడు.

Also Read: Apple iPhone Journey: యాపిల్ ఐఫోన్ ప్రస్థానం.. 2007 నుంచి 2025 వరకు విడుదలైన మోడల్స్ ఇవే!

లిస్ట్‌ ఏ క్రికెట్‌లో కూడా విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. 7 సార్లు 50 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఈ 7 ఇన్నింగ్స్‌ల్లో 135.4 యావరేజ్‌తో 677 రన్స్ బాదాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా పాకిస్థాన్‌ మాజీ బ్యాటర్‌ జావెద్‌ మియాందాద్‌ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన వరుసగా 9 హాఫ్‌ సెంచరీలు బాదారు. ఇమామ్‌ ఉల్‌హక్‌ 7 హాఫ్‌ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. రాస్‌ టేలర్‌, క్రిస్‌ గేల్‌, బాబర్‌ ఆజమ్‌, కేన్‌ విలియమ్సన్‌, షాయ్‌ హోప్‌, పాల్‌ స్టిర్లింగ్‌ వరుసగా ఆరు వన్డేల్లో హాఫ్‌ సెంచరీలు చేశారు.

Exit mobile version