ICC Rankings: ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు తమ హవా కొనసాగించారు. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ బాబర్ ఆజమ్ మూడో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇండియన్ క్రికెటర్స్ సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉన్నాడు. అటు కింగ్ కోహ్లీ 15వ స్థానానికి చేరుకున్నాడు. ఆసియా కప్-2022కి ముందు విరాట్ కోహ్లీ 33వ ర్యాంకులో ఉండగా.. ఆద్భుతమైన ప్రదర్శన కారణంగా కేవలం 15 రోజుల్లోనే 15వ ర్యాంకును సాధించగలిగాడు.
Read Also: Most millionaires in these cities: ప్రపంచంలో ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న నగరాలు ఇవే..
అటు టీ20 టీమ్ ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఇంగ్లండ్, మూడో స్థానంలో దక్షిణాఫ్రికా, నాలుగో స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. ఆసియా కప్ గెలుచుకున్న శ్రీలంక 8వ స్థానంలో ఉంది. బౌలర్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్ తొలిస్థానంలో, దక్షిణాఫ్రికా బౌలర్ షాంసీ రెండో స్థానంలో, ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ మూడో స్థానంలో ఉన్నారు. టీమిండియా నుంచి టాప్-10లో భువనేశ్వర్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ ఉల్ హసన్, ఆప్ఘనిస్తాన్ ప్లేయర్ మహ్మద్ నబీ, శ్రీలంక ఆటగాడు హసరంగ టాప్-3లో ఉన్నారు. భారత్ నుంచి హార్దిక్ పాండ్యా ఏడో స్థానం సంపాదించాడు.
