Site icon NTV Telugu

IND Vs SL: మరోసారి నిరాశపరిచిన విరాట్ కోహ్లీ

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు కోహ్లీ మీదే పడ్డాయి. అతడు సెంచరీ చేయక 833 రోజులు దాటిపోతోంది. ఈ మ్యాచ్‌లో అయినా తమ స్టార్ ఆటగాడు సెంచరీ దాహాన్ని తీర్చుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 45 పరుగులకే అవుటయ్యాడు. ఎంబుల్‌దెనియా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మ సైతం నిరాశకు గురయ్యాడు. డ్రెస్సింగ్ రూంలో ఒక్కసారిగా నిలబడి, తలపై చేతులు పెట్టుకున్నాడు.

మరోవైపు ఈ టెస్టులో విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో 8వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, ద్రవిడ్, సునీల్ గవాస్కర్, లక్ష్మణ్, సెహ్వాగ్ ఈ మైలురాయి అందుకున్నారు. అలాగే టెస్టుల్లో కోహ్లీ ఇప్పటివరకు 900 ఫోర్లు కొట్టాడు. అతడి టెస్టు కెరీర్‌లో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 50.63గా ఉండటం విశేషం.

Exit mobile version