Site icon NTV Telugu

రహానేకు కోహ్లీ మద్దతు…

ప్రస్తుతం భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అనుకున్న విధంగా రాణించలేక పోతున్నాడు. పరుగులు చేయక అభిమానులను నిరాశపరుస్తున్నాడు. దాంతో అతడిని జట్టు నుండి తొలగించాలని విమర్శలు భారీగా వస్తున్నాయి. అయితే ఈ విషయంలో రహానేకు కెప్టెన్ కోహ్లీ మద్దతు ఇచ్చాడు. తాజాగా రహానే గురించి మాట్లాడుతూ… నేను అతని ఫామ్‌ను అంచనా వేయలేను… దాని గురించి ఎవరు ఏం చెప్పలేరు. దానిని ఎలా మెరుగు పరుచుకోవాలి అనేది అతనికి మాత్రమే తెలుస్తుంది. ఈ సమయంలో మన చేయాల్సింది కేవలం అతనికి మద్దతు ఇవ్వడం మాత్రమే అని కోహ్లీ అన్నాడు. ఇక ఈ ఫామ్ కారణంగా భారత జట్టు వెళ్లనున్న సౌథ ఆఫ్రికా పర్యటనకు కూడా రహానే దూరం కానున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు/

Exit mobile version