Site icon NTV Telugu

Virat Kohli: ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. ద్రవిడ్ 504 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 24,064 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 471 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 24,078 పరుగులు సాధించాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే విరాట్ కోహ్లీ కన్నా ముందు నిలిచాడు. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Read Also: Bigg boss 6: అందరి టార్గెట్ ఆమెనే… ఎందుకంటే..?

మరోవైపు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 71 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక సెంచరీల జాబితాలోనూ సచిన్ ముందున్నాడు. సచిన్ ఖాతాలో 100 సెంచరీలు ఉన్నాయి. సచిన్‌ను అధిగమించాలంటే కోహ్లీ ఇంకా 29 సెంచరీలు చేయాల్సి ఉంది. దాదాపు ఈ రికార్డును అందుకోవడం కోహ్లీకి కష్టమేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ టీ20లలో మాత్రం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ 107 మ్యాచ్‌లు ఆడి 3,660 పరుగులు చేయగా ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20లలో 3,694 పరుగులు చేశాడు.

Exit mobile version