NTV Telugu Site icon

IND Vs ENG: నేడు తొలి వన్డే.. కోహ్లీ ఆడతాడా? లేదా?

Virat Kohli

Virat Kohli

నేడు ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలివన్డే జరగనుంది. ఇటీవల మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సోమవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీసుకు విరాట్ కోహ్లీ హాజరుకాలేదు. దీంతో కోహ్లీ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడతాడా, లేదా అనేదానిపై అస్పష్టత నెలకొంది. కోహ్లీ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మూడో టీ20 సందర్భంగా విరాట్‌కు గజ్జల్లో గాయమైంది. ఈ నేపథ్యంలో అతడు తొలి వన్డేలో ఆడే అవకాశాలు తక్కువేనని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Read Also: Fake IPL : ఫేక్‌ ఐపీఎల్‌ ఆట.. కేటుగాళ్ల వసూళ్ల వేట..

గత మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేని కోహ్లీ ఇటీవల మరీ పేలవంగా ఆడుతున్నాడు. దీంతో అతడిపై వేటు వేయాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కోహ్లీకి గాయమైందా లేదా ఫామ్ లేకపోవడం వల్ల తప్పుకుంటున్నాడా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. కొన్ని మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని స్టార్ ప్లేయర్ ఆటను అంచనా వేయవద్దంటూ విమర్శకులకు బదులిచ్చాడు. కాగా తొలి వన్డేలో కోహ్లీ ఆడకపోతే అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం లభించనుంది.

Show comments