Site icon NTV Telugu

IND Vs SL: 100వ టెస్టులో బన్నీని ఇమిటేట్ చేసిన కోహ్లీ.. వైరల్ అవుతున్న వీడియో

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మేనియా ఇంకా తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇటీవల క్రికెటర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో తగ్గేదే లే అంటూ బన్నీ మేనరిజాన్ని ఇమిటేట్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తగ్గేదే లే అంటూ మేన‌రిజంతో ఆక‌ట్టుకున్నాడు. కోహ్లీ చేసిన ఈ ప‌నిని గ్రౌండ్‌లోని కెమెరాలు రికార్డు చేశాయి. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్రస్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

కాగా మొహాలీ టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు అన్న విషయం తెలిసిందే. తన వందో టెస్టులో కోహ్లీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఈ టెస్టులో టీమిండియా కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేయగా విరాట్ కోహ్లీ 45 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా మాత్రం ఆల్‌రౌండ్ షోతో ఆక‌ట్టుకుని ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

Exit mobile version