Site icon NTV Telugu

Virat Kohli Fan : విరాట్ కాళ్లు మొక్కిన అభిమాని.. హగ్ ఇచ్చిన కోహ్లీ

Virat

Virat

ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఆటగాళ్ల గొడవలు, కవ్వింపులతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయితే ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని దండం పెట్టి, అనంతరం కాళ్లు మొక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Also Read : Gangster Murdered in Tihar Jail: తీహార్‌ జైల్లో గ్యాంగ్‌ వార్‌.. గ్యాంగ్‌స్టర్‌ మృతి

విరాట్ కోహ్లీ నువ్వే నా దేవుడివి.. నీ ఆశీర్వాదం కావాలి అనికోరుతున్నట్లుగా విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కాడు. ఆ అభిమానిని లేపి హత్తుకున్న విరాట్ కోహ్లీ.. బయటకు వెళ్లామని చెప్పాడు. దీంతో బయటకు వస్తూ.. నా జన్మ ధన్యమైందని సదరు అభిమానం సంతోషం వ్యక్తం చేశాడు. కోహ్లీని కలిసాననే ఆనందంలో ఉన్న ఆ అభిమాని.. డ్యాన్స్ చేస్తూ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపాయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also Read : Minister KTR : నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

మైదానంలోకి వచ్చిన అభిమాని పట్ల విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ గొప్ప మనసు చాటుకున్నాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లక్నో వేదికగా జరిగిన ఈమ్యాచ్‌లో బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. బౌలర్లు సహకరిస్తున్న పిచ్‌పై పరుగుల కోసం బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులే చేసింది. ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(40 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 44), విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 3 ఫోర్లతో 31) రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీయగా.. రవిబిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read : Adipurush: గ్రాండ్‌గా ‘ఆదిపురుష్’ ట్రైలర్ ఈవెంట్!

అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంకో బాల్ మిగిలి ఉండగానే.. 108 పరుగులకు ఆలౌట్ అయింది. ఫీల్డింగ్ చేస్తున్నపుడు గాయపడ్డ కేఎల్ రాహుల్ చివరిస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, హేజిల్ వుడ్ రెండేసి వికెట్లు.. సిరాజ్, మ్యాక్స్‌వెల్, హసరంగా, హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

Exit mobile version