మ్యాచ్‌లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని దండం పెట్టి, అనంతరం కాళ్లు మొక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు.