Site icon NTV Telugu

Team India: కోహ్లీ మళ్లీ దూకుడుగా ఆడాలి.. చిన్న నాటి కోచ్ సూచన

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు కానీ అతి జాగ్రత్తగా ఆడుతుండటం అతడి కొంప ముంచుతోందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మునుపటిలా ఆడాలంటే దూకుడుగా ఆడాలని సూచించాడు. కెరీర్‌లో ప్రారంభంలో స్వేచ్ఛగా ఆడినట్లే ఇప్పుడు కూడా ఆడితేనే తిరిగి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని తెలిపాడు. దీని కోసం కోహ్లీ మళ్లీ తన అకాడమీకి రావాలని.. అతడు తన బేసిక్స్‌ను తిరిగి నేర్చుకోవాలని కోరాడు.

ఈ విషయంపై త్వరలో కోహ్లీతో మాట్లాడుతానని అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వెల్లడించాడు. కోహ్లీకి తన అకాడమీలో ఉన్నప్పటి విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవాలని హితవు పలికాడు. మరోవైపు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను రిటైన్ చేసుకోకుండా తప్పు చేసిందని రాజ్‌కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌కు అందుబాటులో ఉండని జోఫ్రా ఆర్చర్ కంటే బౌల్ట్‌ను వేలంలో తీసుకుంటే బాగుండేదన్నాడు. బుమ్రాతో కలిసి బౌల్ట్ చాలా మ్యాచ్‌లను గెలిపించాడని.. అలాంటి బౌలర్‌ను వేలంలో కొనుగోలు చేయకపోవడం ముంబై జట్టుకు నష్టం చేకూరుస్తుందన్నాడు.

https://ntvtelugu.com/delhi-capitals-opener-prithvi-shaw-failed-in-yoyo-test/
Exit mobile version