Virat Kohli Instagram Income: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల పేలవంగా ఆడుతున్నాడు. మైదానంలో అతడు పరుగులు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా కాసులు బాగానే సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీకి 100 మిలియన్‌ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ స్థాయిలో ఫాలోవర్లు ఏ క్రికెటర్‌కు కూడా లేరు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ రికార్డు స్థాయిలో డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పలు బ్రాండ్లకు సంబంధించి కోహ్లీ ఒక్క పోస్ట్ చేస్తే రూ.8.69కోట్లు ఆర్జిస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీంతో నెటిజన్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: CBSE Results: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఈ లింక్ చూడండి..!!
అంతేకాకుండా కోహ్లీ సంపాదనపై పలువురు నెటిజన్‌లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఇన్‌స్టాలో 20 పోస్టులు చేసి శ్రీలంక దరిద్రాన్ని తరిమేయగలడని సెటైర్లు వేస్తున్నారు. దేశంలోని పేదరికాన్ని కూడా కోహ్లీ నిర్మూలించగలడని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. అయితే అతడు తిరిగి ఫామ్ సంపాదించేందుకు జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. జింబాబ్వే పర్యటనలో విరాట్‌ను ఆడిస్తే అతను మళ్లీ గాడిన పడతాడని సెలెక్టర్లు కూడా భావిస్తున్నారు. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీ ముందు కోహ్లీ ఫామ్ అందుకోవడానికి జింబాబ్వే పర్యటన బూస్టింగ్ ఇస్తుందని మాజీ క్రికెటర్లు కూడా విశ్లేషిస్తున్నారు.
