Site icon NTV Telugu

Team India: చెత్తగా ఆడుతున్న కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత 50 దిగువకు సగటు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు కనీసం హాఫ్ సెంచరీలైనా చేస్తున్నాడని అభిమానులు మురిసిపోయారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. సెంచరీ సంగతి పక్కన బెడితే… కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. టెస్టు కెరీర్‌లో కోహ్లీ స‌గ‌టు ఏకంగా 50కి దిగువ‌కు ప‌డిపోయింది. దీంతో ఇన్నాళ్లు 3 ఫార్మాట్లలో 50కి పైగా స‌గ‌టుతో ఉన్న కోహ్లీ ప్రస్తుతం ఆ ఘ‌న‌త‌కు దూర‌మ‌య్యాడు.

ప్రస్తుతం టెస్టుల్లో విరాట్ కోహ్లీ స‌గ‌టు 49.96గా ఉంది. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సగటు 50 నుంచి 49.55కి దిగజారింది. తాజాగా అదే శ్రీ‌లంక‌తో కోహ్లీ స‌గ‌టు మ‌ళ్లీ 49కి దిగ‌జారింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 23, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేశాడు. కాగా ఇప్పటివ‌ర‌కు 101 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 49.96 స‌గ‌టుతో 8043 ప‌రుగులు చేశాడు. టీమిండియా మ‌ళ్లీ జూలై వ‌ర‌కు టెస్టు మ్యాచ్‌లు ఆడే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అప్పటివ‌ర‌కు కోహ్లీ స‌గ‌టు 49గానే ఉండ‌నుంది.

https://ntvtelugu.com/rishab-pant-record-half-century-in-bangalore-test/
Exit mobile version