విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత భారత క్రికెట్ లో చాలా అంశాలు చర్చలో ఉన్నాయి. విరాట్ కు చెప్పకుండానే తన కెప్టెన్ పదవిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… కెప్టెన్సీ నుంచి తప్పించే విషయం తనకు తెలుసు అన్నారు. అయితే టీం ఇండియా త్వరలో వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో చీఫ్ సెలక్టర్ నాకు ఈ విషయం చెప్పారు. అయితే మొదట టెస్ట్ జట్టును ఎంపిక చేసిన తర్వాత చివర్లో బీసీసీఐ సెలక్టర్లు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారని అన్నారు.
Read Also : సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ పై స్పష్టం చేసిన విరాట్…
అలాగే రోహిత్ శర్మతో నాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పాడు కోహ్లీ. అయితే విరాట్ కెప్టెన్సీలో జరగనున్న టెస్ట్ సిరీస్ కు గాయం కారణంగా రోహిత్ దూరం కాగా.. రోహిత్ కెప్టెన్సీ లోని వన్డే సిరీస్ కు విరాట్ విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అన్నారు. దాంతో వీరి మధ్య ఏదో జరుగుతుంది అనుకున్నారు. కానీ తాజాగా తాను సౌత్ ఆఫ్రికాలో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాను అని చెప్పిన కోహ్లీ… రోహిత్ తో నాకు ఏ సమస్య లేదు. అతని కెప్టెన్సీలో ఆడటం కోసం ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు.