Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajinkya Rahane on Virat Kohli 100 Centuries: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కింగ్ కోహ్లీ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ కేవలం 88 బంతుల్లోనే 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 బౌండరీలు, 9 సిక్సర్లు ఉన్నాయి.
ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ వన్డేల్లో తన సెంచరీల సంఖ్యను 55కు పెంచుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 86కు చేరుకుంది. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు కింగ్ మరో 14 సెంచరీల దూరంలో ఉన్నాడు. దాంతో కోహ్లీ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకోగలడా? అనే చర్చ మరోసారి మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ భారత బ్యాటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తనపై తానే ఒత్తిడి పెట్టుకున్నప్పుడు అతడి అత్యుత్తమ ఆట బయటకు వస్తుందన్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ తనపై భారీ అంచనాలు పెట్టుకోవడం వల్లే ఇన్నేళ్లుగా కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడని జింక్స్ చెప్పాడు.
Also Read
- India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
‘విరాట్ కోహ్లీ తనపై తానే ఒత్తిడి పెట్టుకున్నప్పుడు అత్యుత్తమంగా ఆడతాడు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ అతడికి తనపై కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే ఇన్నేళ్లుగా ఇంత నిలకడగా ఆడుతున్నాడు. కోహ్లీ రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్. కాబట్టి 100 అంతర్జాతీయ సెంచరీల గురించి కోహ్లీ ఆలోచిస్తే అందులో తప్పేమీ లేదు. అతడు ఆ రికార్డును అందుకోవాలని కోరుకోవడం సహజమే’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు. మరో మాజీ భారత వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ కూడా కోహ్లీ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మైదానంలో ఉన్న ప్రతి క్షణాన్ని అభిమానులు ఆస్వాదించాలని సూచించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతానని కోహ్లీ ఇప్పటికే చెప్పిన విషయాన్ని డీకే గుర్తుచేశాడు.
‘విరాట్ కోహ్లీ ఆడుతున్నంతకాలం అతడి ఆటను మనం ఆస్వాదించాలి. దాదాపు రెండు నెలల పాటు బ్యాట్ పట్టకపోయినా.. వెస్టిండీస్‌పై అతడు ఆడిన విధానం చూస్తే అసలు విరామం తీసుకున్న ఆటగాడిలా కనిపించలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా, ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 88 బంతుల్లో 139 పరుగులు చేయడం, భారీ స్ట్రైక్‌రేట్‌తో సెంచరీ సాధించడం అద్భుతం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంత దూకుడుగా ఆడటం సాధారణ విషయం కాదు. ముఖ్యంగా కోహ్లీ తన బ్యాటింగ్ రిథమ్‌ను తిరిగి అందుకోవడం అత్యంత కీలక అంశం. తరచుగా మ్యాచ్‌లు ఆడకపోయినా.. ఒకసారి ఆ రిథమ్‌ను అందుకుంటే అతడిని మించిన ఆటగాడు ప్రపంచంలో ఉండడు’ అని దినేశ్ కార్తీక్ చెప్పాడు.
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ చూపించిన దూకుడుతో అభిమానుల్లోనూ, మాజీ క్రికెటర్లలోనూ అతడి భవిష్యత్‌పై చర్చ మొదలైంది. సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును కోహ్లీ అందుకుంటాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం మాత్రం కోహ్లీ తన బ్యాట్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. తొలి వన్డేలో సాధించిన జోరును కొనసాగించాలని టీమిండియా చూస్తుండగా.. మరోసారి కోహ్లీ బ్యాటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!