World Wrestling Championships 2022: రెండోసారి కాంస్యం నెగ్గిన వినేశ్.. తొలి భారత మహిళగా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat Wins Bronze Medal In World Wrestling Championships 2022: వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంస్య పతకం సాధించింది. మహిళల 53 కిలోల విభాగం బౌట్‌లో బుధవారం స్వీడన్‌కు చెందిన ఎమ్మా మాల్మ్‌గ్రెన్‌తో 28 ఏళ్ల వినేశ్ ఫొగట్ పోరాడింది. ఈ పోరులో 8-0 తేడాతో నెగ్గి, కాంస్యం దక్కించుకుంది వినేశ్. దీంతో.. ఈ మెగా ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు 2019లో కజకిస్తాన్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం కైవసం చేసుకున్న వినేశ్.. మూడేళ్ల తర్వాత రెండోసారి కాంస్యం సాధించింది.
మొదట.. తొలి రౌండ్‌లో మంగోలియాకు చెందిన ఖులాన్ బత్‌ఖ్యుగా (2022 ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత) చేతిలో వినేశ్ ఫొగట్ 0-7తో ఓడిపోయింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి దూకుడు ప్రదర్శించడంతో.. ఆదిలోనే వినేశ్ వెనుకబడింది. ఆ తర్వాత కూడా గట్టి పోటీ ఇవ్వడంతో.. వినేశ్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఖులాన్ ఫైనల్‌కు చేరడం వల్ల.. ఫొగట్‌కు రెపిచేజ్‌లో తలపడే అవకాశం లభించింది. రెపిచేజ్‌లో భాగంగా కజకిస్తాన్‌కు చెందిన ఇషిమోవాపై 4-0తో వినేశ్ నెగ్గింది. ఆ తర్వాతి రౌండ్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన లైలా గుర్బనోవాతో వినేశ్ తలపడాల్సింది కానీ.. ఆమె గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దీంతో.. వినేశ్ కాంస్య పతక పోరుకి చేరింది. ఈ పోరులో అద్భుతంగా అద్భుతంగా పోరాడి.. ఎమ్మా జొన్నను చిత్తు చేసి, చివరికి కాంస్య పతకం నెగ్గింది.
Also Read
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
- Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
తాజావార్తలు
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!