Vaibhav Suryavanshi: వైభవ్‌కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
- వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ ప్రశంసలు..
- మా వాళ్లు దొరికితే 6 సిక్సులు ఖాయమంటూ పొగడ్తలు..
- పాక్ క్రికెటర్లు సిగ్గు పడాలని వ్యాఖ్యలు..
- బుడ్డోడి ఆటతీరుకు దాయాది ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, అతడి విధ్వంసం కేవలం ఐపీఎల్, భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వైభవ్ పేరు ఇప్పుడు దాయాది పాకిస్తాన్లో కూడా మార్మోగుతోంది. ఈ బుడ్డోడి ఇన్నింగ్స్‌పై పాక్ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై మెరుపు ఇన్నింగ్స్ ఆడి, కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వైభవ్ ఆటకు పాకిస్తాన్ ఫిదా అయింది. వైభవ్‌ను ఇప్పుడు పాకిస్తాన్ ‘‘కాంప్లయిన్ బాయ్’’ అని పిలుస్తున్నారు.
పాకిస్తానీ మాజీ క్రికెటర్, పాక్ క్రికెట్ కోచ్ బాసిత్ అలీ వైభవ్ సూర్యవంశీ ఇన్సింగ్స్‌పై ప్రశంసలు కురిపించారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. అతను క్రిస్ గేల్ కన్నా గొప్ప ఆటగాడని పొగడ్తలు కురిపించారు. పాకిస్తాన్ వైభవ్‌ను క్రికెట్ స్టార్‌గా కీర్తిస్తోంది. ‘‘గేల్ మిస్టర్ యూనివర్స్, కానీ ఇప్పుడు కుర్రాడు మిస్టర్ యూనివర్స్ అయ్యాడు. కాంప్లాన్ తాగే బబ్లూ.. మీరు అతడిని సూర్యవంశీ అని పిలువమంటున్నారు. ఎంత అద్భుతమైన బ్యాటింగ్’’ అంటూ బాసిత్ అలీ కొనియాడారు.
Also Read
- IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
- IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
పాకిస్తాన్లో సామాన్య ప్రజలు కూడా వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పాకిస్తాన్లో ఈద్ పండగ, కానీ ప్రజలంతా ఎక్కువగా వైభవ్‌ను అభినందిస్తున్నారు’’ అని అన్నారు. నిజానికి వైభవ్ అసలైన ఈద్ పండగ జరుపుకుంటున్నాడని కొనియాడారు. ఈ అబ్బాయిని ఏఐతో సృష్టించారా? అని ఆశ్చర్యపోతున్నారు.
స్పోర్ట్స్ యాంకర్ మీరబ్ జీషాన్ షోలో, పాక్ క్రికెట్ అనలిస్ట్ మహ్మద్ మోసిన్ మాట్లాడుతూ..‘‘నేను ఇలాంటి క్రికెట్ ఎప్పుడూ చూడలేదు. దానిని అతను కఠోర శ్రమతో మెరుగుపరుచుకున్నాడు. సూర్యవంశీ వద్ద ప్రతీ బాల్ ఆడే సామర్థ్యం ఉంది. పాట్ కమిన్స్‌ను కూడా ఎదుర్కొన్నాడు. ఒత్తిడిలో ఆడటం అని నైజం కాదు’’ అని అన్నారు.
పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లోని ఒక స్పోర్ట్స్ యాంకర్, సూర్యవంశీ కారణంగా పాకిస్తాన్లో ఐపీఎల్ క్రేజ్ భారీ స్థాయికి చేరిందని అన్నారు. సూర్యవంశీ ఇన్సింగ్స్‌ను వీపీఎన్ ద్వారా పాకిస్తానీలు చూస్తున్నారని, మన క్రికెటర్లను అవమానిస్తున్నాడంటూ వ్యాఖ్యానించాడు. ‘‘ మా స్టార్ బౌలర్ హారిష్ రౌఫ్ చెప్పేది ఏమిటంటే, వైభవ్ సూర్యవంశీ మాకు ఏ మాత్రం లేక్కలోకి రాడు అని అంటున్నాడు. ఒక వేళ ఎప్పుడైనా వైభవ్ షాషీన్, రౌఫ్‌లకు ఎదురుపడితే ఆరు బాల్స్‌లో 6 సిక్సులు ఖాయం’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!