Asia Cup Rising Stars 2026 : వైభవ్ విధ్వంసానికి యూఏఈ విలవిల.. సెమీస్ దిశగా భారత్.!
- వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసం
- 53 బంతుల్లో 204 పరుగులు
- 28 సిక్సర్లతో రికార్డుల మోత
- సెమీస్ దిశగా ఇండియా ఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో ఇండియా ఏ జట్టు సంచలన విజయంతో సెమీఫైనల్ రేసులో దూసుకెళ్లింది. యూఏఈ ఏతో జరిగిన కీలక పోరులో తిలక్ వర్మ సారథ్యంలోని ఇండియా ఏ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ఈ ఏకపక్ష విజయానికి యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన ఊహించని ఇన్నింగ్స్ ప్రధాన కారణమైంది. కేవలం 53 బంతుల్లో 204 పరుగులు బాదిన వైభవ్, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పాడు.
భాటియా శతకం.. అర్షద్ ఖాన్ ధాటికి తడబడ్డ యూఏఈ
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఏ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ పెవిలియన్ చేరగా, ఆ తర్వాత అర్షద్ ఖాన్ బౌలింగ్ ధాటికి యూఏఈ బ్యాటర్లు వరుసగా కష్టాల్లో పడ్డారు. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నా హర్‌ప్రీత్ సింగ్ భాటియా మాత్రం దీటుగా నిలబడి అద్భుత శతకం సాధించాడు. 144 బంతులు ఎదుర్కొన్న భాటియా 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఎథన్ డిసౌజా 25 పరుగులతో ఆదుకోగా, భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో యూఏఈ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? వైభవ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!
- టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
- Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!
- IPL 2027-MI: ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. కెప్టెన్ ఎవరంటే?
16 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 28 బంతుల్లో శతకం
250 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ సూర్యవంశీ తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. అభిషేక్ 5 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటవగా, ఆ వెంటనే ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా 4 బంతుల్లో 3 పరుగులకే వెనుదిరిగాడు. అయినా సరే వైభవ్ తన దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన అతను, ఆ తర్వాత కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు.
52 బంతుల్లో డబుల్ సెంచరీ.. సిక్సర్ల వర్షం
శతకం పూర్తయ్యాక వైభవ్ మరింత భీకరంగా మారిపోయాడు. బౌండరీలతో పాటు సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం 40 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకున్న వైభవ్, 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకుని అందరినీ విస్మయానికి గురిచేశాడు. చివరకు 53 బంతుల్లో 28 సిక్సర్లు, 7 ఫోర్లతో 204 పరుగుల వద్ద ఔటయ్యాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచి చరిత్ర సృష్టించాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
సెమీస్ దిశగా ఇండియా ఏ.. యూఏఈ ఇంటిదారి
వైభవ్ ఔటైన తర్వాత కూడా ఇండియా ఏ బ్యాటర్లు మిగిలిన పనిని వేగంగా పూర్తి చేశారు. కేవలం 14.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించిన ఇండియా ఏ సెమీఫైనల్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏ చేతిలో 48 పరుగుల తేడాతో ఓడిన తర్వాత ఈ గెలుపు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మరోవైపు ఈ ఓటమితో యూఏఈ ఏ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తాజావార్తలు
-
Asia Cup Rising Stars 2026 : వైభవ్ విధ్వంసానికి యూఏఈ విలవిల.. సెమీస్ దిశగా భారత్.!
-
Koti Deepotsavam 2026 Day-11 Live : పదకొండో రోజు.. కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
-
Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
-
Vaibhav Sooryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? వైభవ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!
-
Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!