Vaibhav Sooryavanshi Batting Highlights: ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా మంగళవారం దోహాలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ తరఫున వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 28 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయంటే.. యూఏఈ బౌలర్లపై ఎంత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం 28 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసిన బుడ్డోడు.. 40 బంతుల్లోనే 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. తన పవర్ హిట్టింగ్తో యూఏఈ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు.
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించడంతో భారత్ అలవోకగా విజయం సాధించింది. 250 పరుగుల టార్గెట్‌ను కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భారత్ సెమీస్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రసారం అవడంతో చాలా మంది ఫాన్స్ వైభవ్ ఇన్నింగ్స్‌ను మిస్ అయ్యారు. బుడ్డోడి విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదని బాధపడాల్సిన అవసరం లేదు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తన యూట్యూబ్ ఛానెల్లో మ్యాచ్ హైలైట్స్‌ను పోస్ట్ చేసింది. ఆలస్యం ఎందుకు బుడ్డోడి బ్యాటింగ్‌ను మీరూ చూసేయండి.

