CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్‌లో చెన్నై వీరవిహారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK vs LSG: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం (మే 10) చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అద్భుత విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్‌కే మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో సీఎస్‌కే ప్లేఆఫ్ రేసులో నిలవగా, లక్నో ఆశలు దాదాపు ఆవిరి అయ్యాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అర్ధశతకం బాది ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును నెలకొల్పాడు. దీంతో 2023లో యశస్వి జైస్వాల్ నెలకొల్పిన రికార్డును ఉర్విల్ సమం చేశాడు. మొత్తంగా 23 బంతుల్లో 63 పరుగులు చేసి మ్యాచ్‌ను సీఎస్‌కే వైపు లాగేశాడు.
సీఎస్‌కే ఇన్నింగ్స్ హైలైట్స్..
ఓపెనర్లు సంజు శామ్సన్ (28), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42) తొలి వికెట్‌కు కేవలం 22 బంతుల్లోనే 45 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఉర్విల్, రుతురాజ్ అవుటైన తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (10), కార్తిక్ శర్మ (20) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివర్లో శివమ్ దూబే (15 నాటౌట్), ప్రశాంత్ వీర్ (18 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయాన్ని అందించారు.
Also Read
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
- Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- 21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
లక్నో పోరాటం వృథా..
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ కేవలం 17 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసి, మొత్తంగా 33 బంతుల్లో 85 పరుగులతో (10 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో సీఎస్‌కే బౌలర్ జేమీ ఓవర్టన్ ఒకే ఓవర్లో ఇంగ్లిస్, రిషబ్ పంత్ (15)లను అవుట్ చేసి లక్నోను చావు దెబ్బతీశాడు. ఓవర్టన్ ఈ మ్యాచ్‌లో మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. చివర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లక్నో 200 మార్కును దాటగలిగింది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, చెన్నై 3, లక్నో 3 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రా ముగిసింది.
తాజావార్తలు
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!