అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 భారత్ గెలుచుకున్నవిషయం తెలిసిందే. భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన భీకర పోరులో భారత జట్టు విజయ దుందుభి మోగించింది. బ్యాటిగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం గొంగిడి త్రిష అసాధారణ ప్రతిభ కనబర్చింది. 32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను ఖాతాలో వేసుకుంది.
కాగా ఇవాళ అండర్ 19 విమెన్ ప్లేయర్స్ స్వదేశానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు గొంగిడి త్రిష, ద్రితి కేసరి. వీరితో పాటు టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వారిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.