ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఓ స్టార్ బయటకు వచ్చాడు. అతనే ఉమ్రాన్ మాలిక్. ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరపున చివరి మూడు మ్యాచ్ లలో ఆడిన మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బంతి వేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ ఐపీఎల్ 2021 లో హైదరాబాద్ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. కానీ మాలిక్ ను మాత్రం అక్కడే ఉండాలని బీసీసీఐ కోరినట్లు ఓ హైదరాబాద్ జట్టు యజమాన్యానాయికి సంబంధించిన అధికారి చెప్పారు. ఐపీఎల్ తర్వాత జరగనున్న ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో జట్టుకు నెట్ బౌలర్ గా మాలిక్ ను తీసుకుంది బీసీసీఐ. అయితే ఈ వేగమైన జమ్మూ పేసర్ కోహ్లీ దృష్టిని కూడా ఆకర్షించిన విహాయం తెలిసిందే.
టీం ఇండియాలో హైదరాబాద్ బౌలర్ కు అవకాశం…
