Site icon NTV Telugu

ICC Rankings: బాబర్ ఆజమ్‌ ట్వీట్‌పై ట్రోల్స్.. మాములుగా లేవుగా..!!

Babar Azam

Babar Azam

ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ ఖాతాలో 890 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ ఖాతాలో 836 పాయింట్లు ఉన్నాయి. అయితే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్-3 నుంచి కిందకు పడిపోయాడు. గత వారం వరకు మూడో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్‌ను న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అధిగమించాడు. దీంతో బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Read Also: Shocking Incident: ఒకబ్బాయిపై నలుగురు అమ్మాయిలు సామూహిక అత్యాచారం

అయితే తాజాగా బాబర్ ఆజమ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబర్ తన ట్విటర్‌లో ‘Relaxing under the blue sky’ అని ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్‌లు అతడి ట్వీట్‌ను ట్రోల్ చేస్తున్నారు. బాబర్ కరెక్టుగా ట్వీట్ చేశాడని.. అతడు సూర్యకుమార్ కిందే ఉన్నాడని కౌంటర్లు ఇస్తున్నారు. కొందరు నెటిజన్‌లు అయితే ‘అవును నువ్వు సూర్యకుమార్ యాదవ్ (SKY) కింద రిలాక్స్‌గా ఉండు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐసీసీ ర్యాంకుల్లో ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్, ఆరో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్, ఏడో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్, 8వ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు రోసౌ, 9వ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు అరోన్ ఫించ్, పదో స్థానంలో శ్రీలంక ఆటగాడు నిశాంక కొనసాగుతున్నారు.

https://twitter.com/WaliMoh61967100/status/1595419661927321601

Exit mobile version