NTV Telugu Site icon

Gongidi Trisha: రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు.. నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది

Gongadi

Gongadi

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో యువ కెరటం తెలుగమ్మయి గొంగిడి త్రిష దేశ ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పింది. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది గొంగిడి త్రిష. మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. మ్యాచ్ లో ఎలాంటి ఒత్తిడి తీసుకోలేదన్నారు. ప్రతి మ్యాచ్ లోనూ తన వంతు పాత్ర ఏంటి? జట్టు విజయంలో అండగా నిలవాలని మాత్రమే ఆలోచించానని తెలిపింది.

ఇక మరో ప్లేయర్ ద్రితి గురించి మాట్లాడుతూ.. తను కూడా టాలెంటెడ్ ప్లేయర్, కానీ ఈ సారి తనకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్ లో చోటు సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. ఇక తన తండ్రి గురించి చెప్తూ.. నా సక్సెస్ లో మా నాన్న ఉన్నారు. తన అందించిన ప్రోత్సాహం మరువ లేనిది. నా కెరీర్ కోసం నాన్న ఎంతో కష్టపడ్డారు. తన వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అని అన్నారు.

త్రిష తండ్రి రామిరెడ్డి మాట్లాడుతూ.. తనకు రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు మళ్లించాను అని అన్నారు. నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. సీనియర్ జాతీయ టీంలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తోందని వెల్లడించారు. మరో క్రికెటర్ ధృతి మాట్లాడుతూ.. భారత్ గెలుపులో త్రిష పోరాటం మరువలేనిది అని చెప్పింది. తనకు ప్లేయింగ్ 11లో చోటు దక్కనప్పుడు కాస్త బాధగా అనిపించిందని, కానీ, దేశానికి వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో నేను ఉండడం చాలా గర్వంగా ఉందని అన్నారు.