This Senior Player Wants To Play At Virat Kohli 3rd Place For India: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. క్రికెట్ చరిత్రలో మరే ప్లేయర్ సాధించని ఎన్నో ఘనతల్ని తన పేరిట లిఖించుకున్నాడు. సింగిల్ హ్యాండెడ్‌గా భారత జట్టుని ఎన్నోసార్లు గెలిపించిన చరిత్ర అతనిది. అప్పుడప్పుడు ఫెయిల్ అయిన సందర్భాలున్నాయి కానీ, అతడ్ని రీప్లేస్ చేసే ఆటగాడు మాత్రం ప్రస్తుతం లేడు. కానీ.. ఓ సీనియర్ ప్లేయర్ మాత్రం అతనికి ప్లేస్‌కి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కోహ్లీ టీమిండియా తరఫున ఆడే మూడో స్థానంలో తాను బాగా ఆడుతానని, అదే తనకు సరైన స్థానమని కుండబద్దలు కొట్టాడు. ఇంతకీ.. ఆ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. కేదార్ జాదవ్.
Bhaag Saale: కీరవాణి కొడుకు సినిమాలో ఎన్టీఆర్, చరణ్… థియేటర్స్ లో నవ్వులే
దాదాపు మూడేళ్ల నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న జాదవ్.. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ సీజన్‌లో (2022-23) జాదవ్ అదరగొట్టాడు. 5 ఇన్నింగ్స్‌లలో 110.6 సగటుతో 553 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో కోలాపూర్ టస్కర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జాదవ్.. తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా.. భారత జట్టులోకి తన రీఎంట్రీపై అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని, అందుకు తగ్గట్టు కష్టపడతున్నాని తెలిపాడు. తన ఆటతీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నానని, తాను భాగమైన ప్రతి టోర్నీలో మంచి ప్రదర్శన చేయడమే తన టార్గెట్ అని తెలిపాడు. ఆ తర్వాత సెలక్టర్లు వారి నిర్ణయం తీసుకుంటారన్నాడు.
Jabardast : ఆసియా-నూకరాజు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా?
ప్రస్తుతం తాను చాలా ఫిట్‌గానే ఉన్నానని చెప్పిన జాదవ్.. తనకు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని ఉందని పేర్కొన్నాడు. తాను మహారాష్ట్ర తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్ చేస్తానని.. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో అదే తనకు సరైన స్థానమని, ఆ స్ధానంలో బ్యాటింగ్ వస్తే తాను స్వేఛ్చగా ఆడగలననని చెప్పుకొచ్చాడు. మరి, 38 ఏళ్ల జాదవ్ కోరిక తీరుతుందా? కాగా.. ప్రస్తుతం భారత జట్టులో విరాట్ కోహ్లి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
