NTV Telugu Site icon

World Cup 2023: భారత్ వరల్డ్ కప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తా.. సీఈఓ సంచలనం

Ind Vs Aus

Ind Vs Aus

World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఏ నోట చూసినా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించే వినబడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తం క్రికెట్ ఫ్యాన్స్ పలు కార్యక్రమాలను ప్రారంభించారు. తిరంగాలతో సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కోసం ఒక్క భారతదేశమే కాకుండా, క్రికెట్‌ని ఆరాధించే అనేక దేశాలు ఎంతో ఇంట్రెస్ట్ కనబరుస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆస్ట్రేలియన్ డిప్యూటీ పీఎం, ఇతర రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రెటీలు హాజరుకాబోతున్నారు. మరోవైపు భారత మిత్రదేశం ఇజ్రాయిల్ రాయబారి ఇండియన్ టీంకు మద్దతు తెలిపారు.

Read Also: Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కాల్చి చంపాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే మ్యాచ్‌కి కొన్ని గంటల ముందు ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈఓ పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఇండియా ప్రపంచకప్ గెలిస్తే తన యూజర్లకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. చివరిసారిగా 2011లో ఇండియా ప్రపంచకప్ గెలవడాన్ని గుర్తు చేసుకున్నారు. లింక్డ్‌ఇన్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ భారత్ చివరిసారిగా 2011లో ప్రపంచకప్ గెలిచింది. నేనను కాలేజీలో చదువుకుంటున్నాను. అది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఒకటి. మేము రాత్రంతా మ్యాచ్ స్ట్రాలజీపై చర్చిస్తూనే ఉన్నందున, మ్యాచ్‌కి ముందు రోజు సరిగ్గా నిద్రపోలేదు. మ్యాచ్ గెలిచిన తర్వాత గూస్‌బంప్స్ కలిగాయి. నేను, మా ఫ్రెండ్స్ చండీగఢ్‌లో బైక్ ర్యాలీ తీస్తూ, బాంగ్రా చేశాము’’ అంటూ పోస్ట్ చేశారు.

గతంలో నా ఆనందాన్ని పంచుకునేందుకు స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు మాకు చాలా మంది ఆస్ట్రోటాక్ యూజర్లు ఉన్నారు. కాబట్టి వారి కోసం ఏదైనా చేయాలని, ఈ ఉదయం నా ఫైనాన్స్ టీంతో మాట్లాడానని చెప్పారు. ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే మా వినియోగదారుల వాలెట్లలో రూ. 100 కోట్లు వేస్తానని హమీ ఇచ్చారు. భారత్ గెలుపుకోసం ప్రార్థిద్దాం అని అన్నారు.