NTV Telugu Site icon

పాక్‌కు కింగ్‌ కోహ్లినే టార్గెట్‌..!

మాములుగా పాకిస్తాన్‌, ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌లంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ. అలాంటిది T20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లంటే ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పాక్‌, ఇండియా టీంలు బలంగా ఉన్నాయి. గత రికార్డుల పరంగా చూసుకుంటే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో ఇండియాదే ఆధిపత్యం. ఈ సారి పాక్‌ విరాట్ కోహ్లినే టార్గెట్‌ కానున్నాడా.. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఒక్కసారికూడా ఔట్‌ చేయలేదు.

ఆ జట్టుపై కోహ్లీ 2012లో 78*(61),2014లో 36*(32), 2016లో 55*(37) పరుగులు చేశాడు. దీంతో ఎలాగైనా ఈసారి విరాట్‌ కోహ్లీని భారీ ఇన్నింగ్స్‌ ఆడనీయకుండా కట్టడి చేయాలని భావిస్తోంది ప్రత్యర్థి పాక్‌.. పాక్‌ ప్లాన్‌ వర్కౌవుట్‌ అవుతుందో లేదో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే మరీ.