Site icon NTV Telugu

IndvsWi: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియా

India

India

వెస్టిండీస్‌తో మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇక, టీమిండియా వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కే తుది జట్టులో చోటు దక్కంది. దీంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమ్యాడు. స్పిన్ కోటాలోనూ కుల్దీప్‌ను టీమ్ లోకి తీసుకోగా.. చాహల్ డగౌట్ కి పరిమితమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది.

Read Also: Kushi: సామ్ ను రౌడీ హీరో ఎక్కడా వదలడం లేదుగా

అయితే, టెస్టు సిరీస్‌‌ని 1-0తో కైవసం చేసుకున్న భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఈ వన్డే సిరీస్‌ని చూస్తోంది. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్‌లో అదరగొట్టారు. అయితే శుభ్ మన్ గిల్ ఈ టెస్టు సిరీస్‌లో పెద్దగా రాణింకలేకపోయాడు. ఈ ఏడాది వన్డేల్లో దుమ్మురేపిన గిల్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ పర్ఫామెన్స్‌‌ కూడా బాగుంటే, అతను టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Read Also: Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఇషాన్ కిషన్.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడడం దాదాపు ఖాయమే అయినట్లు కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకునేందుకు సంజూ శాంసన్‌కి ఈ వన్డే సిరీస్ అత్యంత కీలకం. గత ఏడాది వన్డేల్లో ఆడినంత వరకూ సంజూ శాంసన్ బాగానే ఆడాడు.. అయితే తొలి వన్డేలో మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్‌కి తుది జట్టులో అవకాశం ఇచ్చింది.

Read Also: Ambati Rambabu: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. అంబటి ధ్వజం

మహ్మద్ సిరాజ్ గాయంతో స్వదేశానికి తిరిగి వచ్చేయడంతో వన్డే సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్, జయ్‌దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు. రెండో టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్, నేటి మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.. అయితే, ఇవాళ్టి మ్యాచ్లో వెస్టిండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్, వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

Exit mobile version