IND Vs AUS: రెండో టీ20 8 ఓవర్లకు కుదింపు.. టాస్ గెలిచిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs AUS: నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గురువారం కురిసిన వర్షానికి మైదానం చిత్తడిగా మారడంతో పిచ్‌ను డ్రై చేయడంలో ఆలస్యమైంది. దీంతో రెండు జట్ల కెప్టెన్లతో సంప్రదింపుల అనంతరం మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు. కేవలం 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో ఇరు జట్లలో హిట్టర్లు చెలరేగే అవకాశం ఉంది. భారత్‌లో రోహిత్, కోహ్లీ, హార్దిక్, సూర్యకుమార్‌పై భారీ అంచనాలుండగా.. ఆసీస్‌లో గ్రీన్, ఫించ్, మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ వంటి హిట్టర్లు ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది.
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులను చేసింది. ఉమేష్ యాదవ్ స్థానంలో బుమ్రా, భువనేశ్వర్ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చారు. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్ 9:30 నుంచి 10:04 గంటల వరకు.. సెకండ్ ఇన్నింగ్స్ 10:14 నుంచి 10.48 వరకు జరగనుంది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, బుమ్రా, చాహల్
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్, గ్రీన్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, మథ్యూ వేడ్, కమ్మిన్స్, డానియల్ శామ్స్, ఆడం జంపా, హేజిల్‌వుడ్
🚨 Team News 🚨
2⃣ changes for #TeamIndia as @RishabhPant17 & @Jaspritbumrah93 are picked in the team. #INDvAUS
Follow the match ▶️ https://t.co/LyNJTtkxVv
A look at our Playing XI 🔽 pic.twitter.com/Lgh5KVZ95L
— BCCI (@BCCI) September 23, 2022
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!