రిషబ్ పంత్ సారథ్యంలో యంగ్ టీమిండియా టీ-20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుండగానే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు. గురువారం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారాతో పాటు పలువురు ఆటగాళ్లు లండన్ బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.
గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జులై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ రీషెడ్యూల్ టెస్ట్ ప్రారంభం కానుంది. మొత్తం 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో కనీసం ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించిన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో మరో అద్భుత విజయం భారత జట్టు ఖాతాలో చేరనుంది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది టీమిండియా. దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్ ముగిసిన తర్వాత జట్టులోని ఇతర ఆటగాళ్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంగ్లండ్‌కు బయలుదేరనున్నారు.
ఇంగ్లాండ్‌తో గతేడాది జరిగిన టెస్టు సమయానికి ఇప్పటికీ టీమ్ఇండియా జట్టులో చాలా మార్పులు జరిగాయి. ప్రధానంగా అప్పుడు జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టగా.. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కూడా ఇదే పరిస్థితి.. అప్పడు జో రూట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా.. ఈ మ్యాచ్‌కు ఇటీవల టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. కోచ్‌ల విషయంలో కూడా రెండు జట్ల పరిస్థితి ఒకటే.
గతేడాది సిరీస్ సమయంలో ఉన్న కోచ్‌లు ఇప్పుడు లేరు. వారి స్థానంలో కొత్త కోచ్‌లు బాధ్యతలు చేపట్టారు. టీమ్ఇండియాకు కోచ్‌గా గతేడాది సిరీస్‌లో రవిశాస్త్రి ఉంటే.. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలను చేపడుతున్నాడు. ఇంగ్లాండ్‌కు అప్పట్లో క్రిస్ సిల్వర్‌వుడ్ కోచ్‌గా ఉంటే ఇప్పుడు ఆ స్థానంలో బ్రెండన్ మెక్కల్లమ్ వచ్చాడు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ
England bound ✈️
📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm
— BCCI (@BCCI) June 16, 2022
