Rohit Sharma: టీమిండియాను ఊరిస్తున్న రోహిత్ సెంటిమెంట్.. కప్ మనదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్-12లో ఉన్న అన్ని జట్లలో భారత్ ఖాతాలోనే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా 8 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. గ్రూప్-1లో టాపర్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కప్ మనదేనంటూ పలువురు టీమిండియా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ సెంటిమెంట్ టీమిండియాను ఊరిస్తోంది. ఎందుకంటే రోహిత్ కెప్టెన్‌గా చేసిన అన్ని ఫార్మాట్‌లలోనూ తొలి సిరీస్ లేదా తొలి టోర్నీలను గెలుపొందాడు.
Read Also: విడాకులు తీసుకున్న హీరోలనే ఏరికోరి పెళ్లిచేసుకున్న హీరోయిన్లు వీరే..
Also Read
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- RCB Player: ‘ఐపీఎల్‌లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ఉదాహరణకు తీసుకుంటే ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తొలిసారి కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్‌కు టైటిల్ అందించాడు. అంతేకాకుండా తొలిసారి కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను కూడా సాధించిపెట్టాడు. అటు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి వన్డే సిరీస్, తొలి టీ20 సిరీస్, తొలి ముక్కోణపు సిరీస్, తొలి టెస్ట్ సిరీస్, తొలి ఆసియా కప్‌లను రోహిత్ గెలుపొందాడు. దీంతో రోహిత్ ప్రస్తుతం తొలిసారి కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుస్తాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే టీమిండియా సెమీస్‌కు వెళ్లడం కూడా జరిగిందని గుర్తుచేస్తున్నారు. మరి రోహిత్ అభిమానుల సెంటిమెంట్ ప్రకారం మిగిలిన లాంఛనం కూడా పూర్తవుతుందో లేదో వేచి చూడాలి.
Rohit Sharma as captain:-
•Won 1st IPL.
•Won 1st CLT20.
•Won 1st ODI series.
•Won 1st T20I series.
•Won 1st Tri series.
•Won 1st Asia Cup.
•Won 1st Test series.
•Won 1st first away series.
•Now Qualified for Semi in 1st T20 WC.— Tanuj (@ImTanujSingh) November 6, 2022
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!