Site icon NTV Telugu

Rohit Sharma: టీమిండియాను ఊరిస్తున్న రోహిత్ సెంటిమెంట్.. కప్ మనదేనా?

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్-12లో ఉన్న అన్ని జట్లలో భారత్‌ ఖాతాలోనే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా 8 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. గ్రూప్-1లో టాపర్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కప్ మనదేనంటూ పలువురు టీమిండియా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ సెంటిమెంట్ టీమిండియాను ఊరిస్తోంది. ఎందుకంటే రోహిత్ కెప్టెన్‌గా చేసిన అన్ని ఫార్మాట్‌లలోనూ తొలి సిరీస్ లేదా తొలి టోర్నీలను గెలుపొందాడు.

Read Also: విడాకులు తీసుకున్న హీరోలనే ఏరికోరి పెళ్లిచేసుకున్న హీరోయిన్లు వీరే..

ఉదాహరణకు తీసుకుంటే ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తొలిసారి కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్‌కు టైటిల్ అందించాడు. అంతేకాకుండా తొలిసారి కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను కూడా సాధించిపెట్టాడు. అటు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి వన్డే సిరీస్, తొలి టీ20 సిరీస్, తొలి ముక్కోణపు సిరీస్, తొలి టెస్ట్ సిరీస్, తొలి ఆసియా కప్‌లను రోహిత్ గెలుపొందాడు. దీంతో రోహిత్ ప్రస్తుతం తొలిసారి కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుస్తాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే టీమిండియా సెమీస్‌కు వెళ్లడం కూడా జరిగిందని గుర్తుచేస్తున్నారు. మరి రోహిత్ అభిమానుల సెంటిమెంట్ ప్రకారం మిగిలిన లాంఛనం కూడా పూర్తవుతుందో లేదో వేచి చూడాలి.

Exit mobile version