Site icon NTV Telugu

IND vs SL: పింక్ బాల్ టెస్టులో శ్రీలంక టార్గెట్ 447 పరుగులు

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో రోజు ఆటలో మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్ (50), శ్రేయస్ అయ్యర్ (67) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ (46), విహారి (35), జడేజా (22), మయాంక్ (22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు, ఎంబుల్‌దెనియా 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని శ్రీలంక ముందు టీమిండియా 447 పరుగుల టార్గెట్ ఉంచింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టులో టీమిండియా విజయం సాధించడం లాంఛనంగానే కనిపిస్తుంది.

తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్ (92) రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసి టీమిండియా 143 పరుగుల కీలకమైన ఆధిక్యం సాధించింది. కాగా ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.

https://ntvtelugu.com/rishab-pant-record-half-century-in-bangalore-test/
Exit mobile version