IND Vs NZ: క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తడబడింది. సిరీస్ సమం కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ధావన్ సేన 47.3 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సుందర్ రాణించకపోతే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. అతడు 51 పరుగులతో రాణించాడు. సుందర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు ఓపెనర్లు ధావన్ (28), గిల్ (13) విఫలమయ్యారు. అయితే శ్రేయాస్ అయ్యర్ మరోసారి ఆపద్భాందవుడి పాత్రను తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ 59 బంతుల్లో 49 పరుగులు చేశాడు.
Read Also: Poonam Bajwa: ఇంత దగ్గరగా చూపిస్తే ఇంకేమైనా ఉందా?
వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అతడు 10 పరుగులకే వెనుతిరిగాడు. టీ20 నంబర్‌వన్ వీరుడు సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగానే అవుటయ్యాడు. ఆరు పరుగులకే అతడు పెవిలియన్ బాట పట్టాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. దీపక్ హుడా 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అడమ్ మిల్నే, డారిల్ మిచెల్ తలో మూడు వికెట్లు తీయగా, సౌథీ 2, ఫెర్గూసన్, మిచెల్ శాట్నర్ చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్ సమం కావాలంటే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతమే చేయాలి.
