Site icon NTV Telugu

IND Vs PAK: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

Virat Kohli

Virat Kohli

IND Vs PAK: దుబాయ్ వేదికగా సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28), రోహిత్ (28) జోరుతో టీమిండియా 200 పరుగులకు పైగా స్కోరు చేస్తుందని అభిమానులు ఆశించారు. ఓపెనింగ్‌లో శుభారంభం దక్కినా ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయిన భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అయితే చివరి ఓవర్లో వరుసగా కోహ్లీ నాలుగు డాట్ బాల్స్ ఆడి రనౌట్‌గా వెనుతిరిగాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (13), పంత్ (14), హార్దిక్ పాండ్యా డకౌట్‌ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. పాకిస్థాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్‌ 2 వికెట్లు తీయగా, నసీమ్ షా, హరీస్ రౌఫ్, హస్నేన్, మహ్మద్ నవాజ్‌లకు తలో వికెట్ దక్కింది.

Exit mobile version