NTV Telugu Site icon

IND Vs SL: అవకాశం సద్వినియోగం చేసుకోని శాంసన్.. భారత్ స్కోరు ఎంతంటే..?

First T20

First T20

IND Vs SL: ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ క్రికెటర్లు అంచనాల మేర రాణించలేకపోయారు. తొలి టీ20 ఆడుతున్న గిల్, ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కేవలం 7 పరుగులకే అవుటయ్యారు. అటు తుదిజట్టులో అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ కూడా రాణించలేకపోయాడు. కేవలం 5 పరుగులు చేసి మాత్రమే శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 29 పరుగులు చేయగా… దీపక్ హుడా 41 పరుగులతో రాణించాడు. అతడికి అక్షర్ పటేల్ (31) తన వంతు సహకారం అందించాడు.

Read Also: Good News for Drinkers : మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యంపై పన్ను రద్దు

దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 163 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. శ్రీలంక బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. దిల్షాన్ మధుశంక, మహీష్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వ, హసరంగ తలో వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో రజత్ పటీదార్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించినా.. శుభ్‌మన్‌ గిల్‌కే టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. కానీ అతడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు. అటు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.