Team India: టీమిండియా అరుదైన రికార్డు.. ఈ ఏడాదిలో రెండోసారి

Team India Record

Team India Record

Team India Record: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మేరకు టీమిండియా ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌ను 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అప్పుడు భారత ఓపెనర్లు 197 పరుగుల టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా ఛేదించారు. ఇప్పుడు జింబాబ్వేపై 192 పరుగుల టార్గెట్‌ను కూడా వికెట్లేమీ కోల్పోకుండా ఛేజ్ చేసి గెలిపించారు. ఈ మ్యాచ్ ద్వారా కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలిసారి భారత్ వన్డే మ్యాచ్ గెలుపొందింది. దీపక్ చాహర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Read Also: షియోమి ‘కుంగ్‌ ఫూ రోబో’ ప్రత్యేకతల గురించి తెలుసా?

×
×
Ad

అటు జింబాబ్వేపై ఓటమి అనేది లేకుండా వరుసగా 13 విజయాలను అందుకుని టీమిండియా మరో ఘనత సాధించింది. 2013 నుంచి 2022 వరకు జింబాబ్వేపై వన్డేల్లో భారత్‌కు ఓటమి అనేది ఎదురు కాలేదు. అటు 1988-2004 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌పై 12 వరుస విజయాలను భారత్ సాధించింది. 1986-88 మధ్య న్యూజిలాండ్‌పై వరుసగా 11 వన్డేల్లో భారత్ గెలుపొందింది. 2002-2005 మధ్య కాలంలో జింబాబ్వేపై వరుసగా 10 వన్డేల్లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. టీమిండియానే కాదు.. ఈరోజు జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే కూడా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో ఏకంగా 9వ వికెట్‌కు 70పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇండియాపై అత్యుత్తమ 9వ వికెట్ భాగస్వామ్యాన్ని జింబాబ్వే నెలకొల్పింది. జింబాబ్వే టెయిలెండర్లు ఎంగర్వా (34), ఎవాన్స్ (33) వీరోచితంగా పోరాడారు.