NTV Telugu Site icon

India Head Coach: రాహుల్ ద్రావిడ్‌పై వేటు.. హెడ్ కోచ్ రేసులో ఐదుగురు! భారత్ నుంచి ఇద్దరు

Untitled Design (2)

Untitled Design (2)

These 5 Players Can Replace Rahul Dravid As India’s Head Coach: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన రోహిత్ సేనపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌లపై.హెడ్ కోచ్ పదవి నుంచి ద్రవిడ్‌ను తప్పిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అండర్-19 కోచ్‌గా భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ది వాల్‌పై బీసీసీఐ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.

రవిశాస్త్రి అనంతరం 2021 నవంబర్‌లో భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బాధ్యతలు చేపట్టాడు. అండర్-19 కోచ్‌గా సక్సెస్ అయిన ద్రవిడ్.. జాతీయ జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2022లో ఆసియా కప్ ఫైనల్ చేరని భారత్.. 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ నుంచే ఇంటిదారి పట్టింది. ఇక ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ద్వైపాక్షిక సిరీస్‌లు తప్ప.. ఐసీసీ టోర్నీలో తన మార్క్ చూపెట్టలేకపోయాడు. దీంతో ద్రవిడ్ పనితీరు పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. హెడ్ కోచ్‌గా అతడిని తప్పించాలనే వార్తలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం 2023 వన్డే ప్రపంచకప్ వరకూ హెడ్ కోచ్‌గా అతడినే కొనసాగించే అవకాశం ఉంది.

Also Read: Adipurush 1st Day Collections: ‘ఆదిపురుష్’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. క్రేజ్ మాములుగా లేదుగా!

ఒకవేళ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తప్పుకుంటే.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐదుగురు దిగ్గజాలు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఇద్దరు భారత మాజీలు ఉండగా.. ముగ్గురు విదేశీ ప్లేయర్ ఉన్నారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆశిష్ నెహ్రా (Ashish Nehra) ముందువరుసలో ఉన్నారు. ఎందుకంటే తొలి సీజన్లోనే గుజరాత్‌ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2023లో గుజరాత్‌ను ఫైనల్ చేర్చాడు. కనీసం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు అయినా అతడు కోచ్‌గా ఉండే అవకాశం ఉంది.

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ఇప్పటివరకూ హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం లేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. లక్నో జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరింది. దాంతో గంభీర్ కూడా రేసులో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఈ రేసులో ముందున్నాడు. అయితే చెన్నై అతడ్ని వదులుకుంటుందో లేదో చూడాలి. వీరితో పాటు ఆస్ట్రేలియా దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ ఉన్నారు. మరి బీసీసీఐ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

Also Read: TNPL 2023: ఇదేందయ్యో ఇది.. ఒక బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్‌! వైరల్ వీడియో

 

Show comments