Site icon NTV Telugu

IND Vs PAK: మెల్‌బోర్న్ వద్ద రచ్చ రచ్చ.. స్విమ్మింగ్ పోటీలైనా నిర్వహించాలని ఫ్యాన్స్ వినతి

Melbourne

Melbourne

IND Vs PAK: మెల్‌బోర్న్ వేదికగా కాసేపట్లో భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో స్టేడియం పరిసరాల్లో సందడి నెలకొంది. దాయాదుల మహాసమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారు. భారత జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం పడకపోవడంతో భారత్ అభిమానులు ఖుషీలో ఉన్నారు. ఈరోజు వరుణుడు పక్క దేశాలకు వెళ్లిపోవాలని ప్రార్థిస్తు్న్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి టోర్నీలో శుభారంభం ఇవ్వానలి కోరుకుంటున్నారు.

Read Also: Ind Vs Pak: పాకిస్థాన్ హ్యాట్రిక్ కొడుతుందా? టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

అటు ఈ మ్యాచ్ వర్షం వల్ల సాధ్యం కాకపోతే కనీసం భారత్-పాకిస్థాన్ మధ్య స్విమ్మింగ్ పోటీలైనా పెట్టాలని కొందరు నెటిజన్‌లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ సాధ్యం కాకపోతే ఐసీసీ ఈ ప్రత్యామ్నాయాన్ని వినియోగించుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. స్విమ్మింగ్‌లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి నిపుణులు భారత్‌కు ఉన్నారని.. ఏ పోటీ పెట్టినా అంతిమ విజయం భారత్‌దేనని టీమిండియా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా మెల్‌బోర్న్‌ స్టేడియంలో మొత్తం కెపాసిటీ 90వేలు కాగా సుమారు లక్ష మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను తిలకించనున్నారు. అంటే నిలబడి మరీ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.

Exit mobile version