Site icon NTV Telugu

IND Vs WI: వైట్ వాష్‌పై టీమిండియా గురి.. నేడు విండీస్‌తో మూడో వన్డే

ఈరోజు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో అదరగొడుతూ తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచిన భారత్ ఇప్పుడు మూడో వన్డేపై కన్నేసింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. నామమాత్రపు వన్డే కావడంతో… ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో ఆడతాడని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ స్పష్టం చేశాడు. అయితే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తుందో లేదో వేచి చూడాలి.

మరోవైపు వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. బౌలింగ్‌లో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో విఫలం కావడం ఆ జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవడం వెస్టిండీస్‌కు పెద్ద సవాల్‌గా మారింది. రెండో వన్డేకు దూరంగా ఉన్న కీరన్ పొలార్డ్ ఈ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Exit mobile version