Site icon NTV Telugu

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు.

Read Also: టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా.. ఎందుకంటే?

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు యువరాజ్-హేజల్ దంపతులను అభినందనలతో ముంచెత్తుతున్నారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా యువరాజ్‌ను అభినందించాడు. ‘అభినందనలు సోదరా. నువ్వో గొప్ప తండ్రివి అవుతావు. చిన్నారిపై బోల్డంత ప్రేమ కురిపిస్తావు’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. కాగా యువరాజ్ సింగ్ పోస్టునే యథాతథంగా హేజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. యువరాజ్-హేజల్ కీచ్‌ దంపతులు 2016, నవంబర్ 30న వివాహం చేసుకున్నారు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో యువరాజ్ హీరోగా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన ఘనత కూడా యువీ పేరిటే ఉంది.

Exit mobile version