Site icon NTV Telugu

ప్రియురాలితో టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ ఎంగేజ్‌మెంట్

టీమిండియాకు చెందిన మరో క్రికెటర్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్, స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు తన గర్ల్ ఫ్రెండ్‌ మేహతో గురువారం ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం 28వ జన్మదినం జరుపుకున్న అక్షర్ పటేల్ దానిని మరింత మధురంగా మార్చుకున్నాడు. తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అక్షర్ పటేల్ అభిమానులతో పంచుకున్నాడు.

అక్షర్ పటేల్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత అతడి స్నేహితుడు చింతన్ గాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అక్షర్ పటేల్-మేహ నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశాడు. అక్షర్ మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఆ ఫోటో ఉంది. అలాగే ప్రేమ చిహ్నంతో పాటు ‘మ్యారీ మీ’ అని బ్యాక్‌ గ్రౌండ్‌లో పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉండగా, పూలతో చెక్కిన లవ్ సింబల్‌పై వారిద్దరూ నిల్చున్న ఫొటోలను అక్షర్ పటేల్ షేర్ చేశాడు. కాగా అక్షర్ పటేల్‌కు టీమిండియా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్ సహా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Exit mobile version