Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India History: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో పురుషుల టీ20ల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది.
టీమిండియా ఇప్పటివరకు 11 సార్లు 100కు పైగా పరుగుల తేడాతో విజయాలు సాధించింది. ఈ జాబితాలో కెనడా 10 విజయాలతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు కెనడాతో సమానంగా భారత్ ఉంది. లంకపై విజయంతో టాప్ లేపింది. ఈ జాబితాలో ఆస్ట్రియా 9 విజయాలతో మూడో స్థానంలో ఉంది. టీ20 టోర్నమెంట్లో రెండు పూర్తి సభ్య దేశాల మధ్య జరిగిన సెమీఫైనల్ లేదా ఫైనల్లో ఇదే అత్యధిక విజయ మార్జిన్ కావడం మరో విశేషం. భారత్ 124 పరుగుల విజయంతో గత రికార్డును అధిగమించింది. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన 96 పరుగుల విజయమే ఇంతకుముందు అత్యధిక మార్జిన్‌గా ఉంది.
Also Read
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత బౌలర్లు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో 9.5 ఓవర్లకే ఇన్నింగ్స్ ముగిసింది. చివరకు 45 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో భారత్ స్వర్ణ పతక పోరుకు చేరుకుంది. గత ఆసియా క్రీడల్లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఇప్పుడు ఫైనల్లో పసిడి పతకం కోసం తలపడనుంది.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?