Rahul Dravid: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత పేసర్ అవేష్ ఖాన్ ఆడే పరిస్థితి లేదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. అవేష్ ఖాన్ జ్వరం బారిన పడ్డాడని.. అందుకే నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరం అయ్యాడని వివరించాడు. మరోవైపు పాకిస్థాన్ బౌలింగ్ లైనప్ బాగుందని.. వాళ్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ బౌలింగ్ గురించి మాట్లాడుతూ సెక్సీ అనే పదాన్ని పలకబోయి ద్రవిడ్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. తాను ఈ పదాన్ని పలకాలని అనుకుంటున్నప్పటికీ అది సరికాదని గట్టిగా నవ్వాడు. నోటి దాకా వచ్చినా దాన్ని బయటపెట్టడం లేదన్నాడు. ఆ పదం గురించి హింట్ ఇవ్వాలంటూ జర్నలిస్టులు ప్రశ్నించగా.. ఎస్ అనే ఇంగ్లీష్ అక్షరంతో మొదలయ్యే నాలుగు అక్షరాల పదమంటూ ద్రవిడ్ దాటవేశాడు.
Read Also: Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి
అటు బౌలర్ బంతిని ఎంత వేగంతో విసురుతున్నాడు.. దాన్ని స్వింగ్ చేయగలుగుతున్నాడా.. లేదా అనేది ప్రధానం కాదని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉందనేది ప్రధాన అంశమన్నాడు. పాకిస్థాన్‌కు ధీటుగా టీమిండియాకు బౌలింగ్ వనరులు ఉన్నాయని ద్రవిడ్ స్పష్టం చేశాడు. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా బౌలర్లు 147 పరుగులకే కట్టడి చేసిన విషయాన్ని ద్రవిడ్ గుర్తుచేశాడు. టీమిండియా బౌలింగ్ కంటే బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని టెక్నిక్స్ పాక్‌లో లోపించినట్లు పేర్కొన్నాడు.
