ICC Test Championship: ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసు రసవత్తరంగా మారింది. పాకిస్థాన్ పర్యటనలో రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ ముందంజ వేసింది. అయితే పాకిస్తాన్‌కు మాత్రం చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే పాకిస్తాన్ ఓడిపోవడంతో టీమిండియా లాభపడింది. ఎందుకంటే టీమిండియా ముందుకు వెళ్లే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జాబితాలో పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు చాలా దెబ్బతిన్నాయి.
Read Also: Vasireddy Padma: మహిళలకు ప్రేమించే హక్కు, నిరాకరించే హక్కు రెండూ ఉంటాయి
అయితే పాకిస్థాన్‌కు పూర్తిగా దారులు మూసుకుపోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టులు ఆడుతున్న ఆస్ట్రేలియా పాయింట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మెరుగుపడనున్నాయి. అదే సమయంలో టీమిండియా ఆసీస్‌తో టెస్టు సిరీస్ గెలిస్తే ఆస్ట్రేలియా, భారత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో శ్రీలంక, నాలుగో స్థానంలో భారత్, ఐదో స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై భారత్ గెలిస్తే రెండో స్థానానికి చేరుకునే అవకాశముంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం భారత్ చేతుల్లోనే ఉంది. బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేసి భంగపడితే మొత్తానికే మోసం వస్తుంది.
